Wednesday, April 21, 2021

Latest Posts

బర్త్ డే సుధీర్ బాబును లెజెండ్ సూపర్ స్టార్ అంటున్న అభిమానులు

సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంచి నటుడు అనిపించుకున్నారు సుధీర్ బాబు.. ఏమాయ చేసావే ద్వారా తెలుగు లో సహాయ నటుడుగా ప్రయాణం మొదలు పెట్టిన ఆయన సినిమా కెరియర్ అనతి కాలంలోనే  ఎస్‌ఎం‌ఎస్ సినిమా ద్వారా హీరోగా అవకాశం అందిపుచ్చుకున్నారు. తర్వాత మారుతి దర్శకత్వంలో  వచ్చిన ప్రేమ కథ చిత్రం అయితే యూత్ ని ఎలా ఆకర్షిచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

నటుడుగా కొన్ని విజయాలు  సొంతం చేసుకున్నా ఆయనకు మాత్రం అభిమానులు చాలా మంది ఉన్నారు.  దానికి నిదర్శనం ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా వచ్చిన విషెస్. ఈ రోజు తెల్లవారుజాము నుండి, ‘హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు’  అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అతని అభిమానులు మీరు లెజెండ్ సూపర్ స్టార్ అంటూ ఆయనను తెగ పొగిడేసారు. ఇలాగే త్వరలో రాబోతున్న “వి” చిత్రంలో ప్రతి నాయకుడిగా మెప్పించాలని అలాగే మరెంత మందో అభిమానం చూరగొనాలి అని అఖంక్షిస్తూ 99తెలుగు చానల్ తరుపున సుధీర్ బాబు కి శుభకాంక్షలు.

Happy Birthday Sudheer Babu

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss