SUN network gave PPE kits to their Journalist staff
దక్షిణాదిలో పుట్టి దేశము మొత్తం మీద ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ విభాగంలో భారత దేశంలో 3 వ స్థానంలో ఉన్న SUN నెట్ వర్క్. తెలుగుకు సంబంధించి జెమినీ మ్యూజిక్, జెమినీ మూవీస్, జెమినీ టీవీ అనుబంధ సంస్థలన్నీ SUN నెట్ వర్క్ కి సంబందించిన అనుబంధ సంస్థలు. మలయాళంలో సూర్య, తమిళంలో సన్ టీవీ లు కూడా వీటి అనుబంధ సంస్థలే. సన్ నెట్వర్క్ ఇంతకూ ముందు న్యూస్ చానల్స్ ను కూడా ప్రాతినిధ్యం వహించింది. కాగా తమిళ్ లో తప్ప మిగిలిన భాషల్లో న్యూస్ చానల్స్ ను తీసివేయడం జరిగింది. అయితే ఎంటర్టైన్మెంట్ ను వ్యాపారంగా మలచవచ్చని కాకపోతే వార్తా సమాచారాన్ని వ్యాపార రంగంగా మార్చడం ఇష్టం లేక వార్తా చానల్స్ ను ఉచితంగా ప్రసారం చేసినను పక్షపాతం లేకుండా వార్తా సమాచారాన్ని ఇవ్వాలని తలపెట్టినా తరువాత మాత్రం ఒక్క తమిళ్ నాడులో తప్ప ఇతర భాషల్లో వార్తా చానెళ్లను ఆపివేయడం జరిగింది.
ఇబ్బడి ముబ్బడిగా ఛానళ్ళు పుట్టగొడుగులుగా పుట్టడంతో తమ చానెళ్లను విస్తరించే ప్రయత్నం చేశారు. కాగా అప్పటి ఫైనాన్సియల్ క్రైమ్స్ కారణంగా రెన్యువల్ ను నిరాకరించింది కేంద్ర ప్రభుత్వం. కాగా కొత్త ఛానల్ పెట్టే అవకాశం లేనందున ఉన్న చానల్స్ ను ఎంటర్టైన్మెంట్ చానెళ్లుగా మర్చి న్యూస్ ఛానళ్ళును ఆపివేయడం జరిగింది. కాగా ఉద్యోగుల విషయంలో సన్ నెట్ వర్క్ అవలంబించిన విధానాలు మాత్రం అభినందించాల్సిన విషయం. డిపార్ట్మెంట్ వేజెస్, ఇన్ టైం వేతనాలు సన్ నెట్ వర్క్ తమ ఉద్యోగుల పట్ల ఎంత శ్రద్ద చూపిస్తుందో తెలుస్తుంది. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో జర్నలిస్టులు సైతం వార్త విషయాలను సేకరించటానికి బయట ఉంటున్నందున వారి సిబ్బందికి PPE కిట్లను ఇవ్వడం జరిగింది. కాగా భారత దేశంలో మొట్ట మొదటిగా తమ సిబ్బందికి PPE కిట్లు ఇచ్చి ప్రాథమిక రక్షణ ఇస్తున్న సన్ నెట్ వర్క్ యాజమాన్యం అభినందనీయం.