Sunny Leone New House
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ముంబైలోని అంధేరి శివారులో 4,365 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ .16 కోట్లకు కొనుగోలు చేసింది. తన కొత్త ఇంటిని మార్చి 28న కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అట్లాంటిస్ యొక్క 12వ అంతస్తులోని అపార్ట్మెంట్, రియల్టర్ క్రిస్టల్ ప్రైడ్ డెవలపర్స్ చేత కన్ స్ట్రక్షన్ అవుతున్న దానిలో సన్నీ లియోన్ ఇంటిని రిజిస్టర్ చేసుకుంది.
ఇకపోతే ఈ ఇంటికి మూడు కార్ పార్కింగ్ స్పేస్ లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సన్నీ లియోన్ తన డాక్యుమెంట్ పేరు కరెన్జిత్ కౌర్ వోహ్రా కింద రిజిస్టర్ చేసుకుంది. ఇకపోతే ఈ బాలీవుడ్ నటికి ఇప్పటికే లాస్ ఏంజెల్స్ లో పెద్ద బంగళా కూడా ఉంది. అయితే ఇండియా లో స్థిర పడాలనే ఉద్దేశంతో ఈ భవనం కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం.
గృహ అమ్మకాలను ప్రోత్సహించడం కోసం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నుండి డిసెంబర్ చివరి వరకు 5% ఉన్న స్టాంప్ డ్యూటీ ఛార్జీలను 2% కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి: