Saturday, May 15, 2021

Latest Posts

ముంబై ఇండియన్స్‌పై సన్రైజర్స్ హైదరాబాద్ విజయం

ఐపీఎల్‌ సీజన్ -13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్ణిత ఓవర్స్ లో ముంబై నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (85 నాటౌట్‌ :58 బంతుల్లో 10ఫోర్లు,సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (58 నాటౌట్: 45 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్‌ వికెట్‌ కోల్పోకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు పొలార్డ్‌ మెరుపు ఇన్నింగ్స్‌లకు తోడు క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ , జేసన్‌ హోల్డర్‌, షాబాజ్‌ నదీం అద్బుతంగా రాణించడంతో ముంబై భారీ స్కోరును చెయ్యలేక పోయింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss