Thursday, May 13, 2021

Latest Posts

అప్పుడే 55ఏళ్ళు అయిందా

Super Star Krishna Tene Manasulu is celebrating its 55 years:

ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క అక్కినేని తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తున్న సమయంలో అందరూ కొత్త నటులతో దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఓ చిత్రాన్ని తీశారు. ఆ సినిమాకు హీరోగా సెలెక్ట్ అయిన ఘట్టమనేని శివ రామకృష్ణ ఈ సినిమా ద్వారా కృష్ణగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో జేమ్స్ బాండ్ చిత్రాలకు,గూఢచారి మూవీస్ పెట్టింది పేరుగా ఇండస్ట్రీలో దూసుకెళ్లారు.

అంతేకాదు,టాలీవుడ్ లో సినిమా స్కోప్,కలర్,70ఎం ఎం వంటి ఎన్నో ఆధునిక సౌకర్యాలను పరిచయం చేసిన కృష్ణ డేషింగ్ డేరింగ్ హీరోగా నిలిచాడు. ఆ తర్వాత సరికొత్త పంథాలో ప్రయాణించి తెలుగు తెర సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. 350కి పైగా సినిమాలు చేశారు. ఆయన తనయుడు మహేష్ బాబు సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ అయ్యాడు.

అయితే `తేనె మనసులు` విడుదలై మార్చి 31 నాటికి 55 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా మహేష్ బాబు ఆ సినిమా గుర్తు చేసుకున్నాడు. `నాకెంతో ఇష్టమైన సినిమా. ఆల్ టైమ్ క్లాసిక్.. తేనెమనసులు. 55 ఏళ్ల క్రితం ఈ సినిమాతోనే మన సూపర్‌స్టార్ కృష్ణగారి ప్రయాణం మొదలైంది. బ్లాక్‌బస్టర్ ఆరంభం’అని మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంటూ, `తేనెమనసులు` పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss