గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై గత కొద్ది రోజులుగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఇదే తరుణంలో సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలని జగన్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయస్థానం హెచ్చరించింది. జస్టిస్ లావు నాగేశ్వర్రావుతో కూడిన ధర్మసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. ప్రతివాది సూర్యదేవర వెంకట్రావు తరపున గుంటూరు ప్రేరణ, ప్రమోద్ వాదించారు. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు తీర్పు అమలు చేయలేదని వాదించారు.
ఇది కూడా చదవండి: