Thursday, December 2, 2021

Latest Posts

రాజకీయ పార్టీలకు భారీ జరిమానాలు విధించిన సుప్రీంకోర్టు

Supreme Court Imposes Fine On 8 Political parties

బీజేపీ-కాంగ్రెస్‌తో సహా ఎనిమిది రాజకీయ పార్టీలకు భారి జరిమానాలు విధించింది సుప్రీంకోర్టు. ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసులను పబ్లిక్ చేయకుండా పోటీ చేయడంపై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల నేర చరిత్రను బహిరంగ పరచాలనే కోర్టు ఆదేశాలను పాటించనందుకు బీజేపీ మరియు కాంగ్రెస్‌లకు చెరో లక్ష రూపాయలు మరియు ఎన్‌సిపి, సీపీఎంలకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది సుప్రీమ్.

అలాగే రాజకీయ పార్టీలు నిద్ర నుంచి మేల్కొలపాలని, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మేల్కొని రాజకీయాల్లో నేరాలను అంతం చెయ్యడానికి ముందడుగు వెయ్యాలని సూచించింది. అలాగే నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్ల హోమ్‌పేజీలో ఉంచాలని, ప్రతి పార్టీ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో అవి తప్పనిసరిగా కనిపించేలా ఉంచాలని ఆదేశాలు జారి చేసింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss