Home రాజకీయం లాక్ డౌన్ కాలపు ఉద్యోగుల జీతం చెల్లించాలా? వద్దా?

లాక్ డౌన్ కాలపు ఉద్యోగుల జీతం చెల్లించాలా? వద్దా?

Supreme Court Judgement On Employees Salary Payment for Lockdown Days, Court Judgement On Lockdown payments, Lockdown Salaries,99Telugu

భారతదేశమంతటా గత 75 రోజులుగా లాక్ డౌన్ లో ఉన్న కారణంగా, ప్రైవేట్ యాజమాన్యాలు వారి ఉద్యోగులకు పూర్తి జీతాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్ట్ తోసి పుచ్చింది. ఈ మేరకు లాక్‌డౌన్‌ వేతనంపై సుప్రీం తీర్పును వెల్లడిస్తూ ప్రైవేట్ పరిశ్రమలు సమతౌల్యం సాదించి వారి ఉద్యోగుల జీత బత్యాల గురించి వారే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. కాగా దేశమంతటా లాక్ డౌన్ లు ఉన్న సమయంలో ఉద్యోగుల వేతనాలు చెల్లించాలా వద్దా అనే విషయాన్ని పూర్తిగా వారి వారి యాజమాన్యాలకు విడిచిపెట్టింది ధర్మస్థానం. కాగా ఇటువంటి విషయాలలో సుప్రీం కోర్ట్ జోక్యం తగదని భావించింది. అయితే మార్చ్ 29 న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో వారి ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని ప్రైవేట్ యాజమాన్యాలను ఆదేశించింది. కాగా ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ నమోదయిన పిటీషన్ లను పరిశీలించిన సుప్రీం కోర్ట్ ఈ మేర వాద ప్రతివాదనలను విని ఒక నిర్ణయానికి వచ్చి ఈ మేర తీరుపునింక్చింది.

ఇది కూడా చదవండి: 

Exit mobile version