కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించిన ప్రభుత్వం ఇప్పటికే 3 దశలుగా లాక్ డౌన్ ను పొడిగిస్తువచ్చింది. మూడవ దశ కూడా రేపటితో ముగియనుంది. మరి తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేము. కాగా ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై ఉండటం వల్ల వారు ఆర్ధికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు.
దానిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీసుకున్న రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన చేసింది. అయితే ఆర్బీఐ చేసిన ప్రకటనపై స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందో లేదో వివరించాలని కోరుతూ భారత స్థిరాస్తి రంగ అభివృద్ది సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ ధాకలు చేసింది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు మారటోరియంపై స్పష్టత ఇవ్వాలని అటు కేంద్రంకు, ఇటు ఆర్బీఐలకు నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: 8000 మంది సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపి.ఎస్.ఆర్.టి.సి.