Monday, July 26, 2021

Latest Posts

పరీక్షల విషయంలో ఆంధ్రాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

Supreme Court Warning To AP Government

తాజాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్ మీడియట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే దీని పై పలు చోట్ల పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీని పై సుప్రీం కోర్ట్ ఆంధ్రాకు గట్టి హెచ్చరికను ఇచ్చింది. ఇంటర్ మీడియట్ విధ్యార్ధులకు పరీక్షలు నిర్వహించే సమయంలో ఏ ఒక్కరి ప్రాణం పోయిన దాని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుందని కోర్ట్ రాష్ట్రానికి వార్నింగ్ ఇచ్చింది.

ఇక ఇంటర్ మీడియట్ పరీక్షలు జూలై మాసంలో నిర్వహించాలని ఎపి ప్రభుత్వం నిర్వహించింది. ఇక పరీక్షల్లో 5 లక్షల మంది విధ్యార్ధులు వ్రాయనున్నారు మరియు పరీక్షా హాలులో 15 కంటే ఎక్కువ మంది విద్యార్థులను అనుమతించబోమని ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా కోసం అన్ని భద్రతా ప్రోటోకాల్‌లు పాటించబడతాయని కోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss