Monday, July 26, 2021

Latest Posts

ఓటీటీ విడుదల పై సురేష్ బాబు ఘాటు స్పందన

Suresh Babu Comments On OTT Release

సీనియర్ నిర్మాత సురేష్ బాబు తాను నిర్మిస్తున్న నారప్ప, దృశ్యం 2 మరియు విరాటపర్వం సినిమాలను ఓటిటిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాతలు డైరెక్ట్ ఒటిటి విడుదల కోసం చూడడం దురదృష్టకరమని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మరో వారంలో సినిమా హాల్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉండడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరం అని చెప్పింది.

దీని పై నిర్మాత సురేష్ బాబు ఘాటుగా స్పందించారు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను అంగీకరించారు. అయితే ఎవరి పని వారు చూసుకోవాలని, ఇలాంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవాలని మరియు సినిమాలో పెట్టుబడి పెట్టిన వాటాదారులకు తమ నిర్ణయాన్ని వదిలివేయాలి అని చెప్పారు.

అయితే త్వరలోనే విషయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాను అని, సురేశ్ బాబు చెప్పాడు. సురేష్ బాబు స్వయంగా ఎపి, తెలంగాణలో మంచి సంఖ్యలో థియేటర్లను కలిగి ఉన్నారు. అలాంటి అతను తన సినిమాలను ఓటిటిలో విడుదల చేస్తే థియేటర్ పరిస్థితులు ఏంటని చిత్ర పరిశ్రమలో ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss