Wednesday, April 21, 2021

Latest Posts

రానా పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సురేష్ బాబు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్ రానా దగ్గుబాటి ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. మంగళవారం ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలు ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తన ప్రపోజల్‌కి ఆమె అంగీకరించినట్టు ట్వీట్ చేశాడు రానా దాంతో అటు సెలబ్రిటీలకు, ఇటు అభిమానులు వీరి పెళ్లి గురించి తెగ చర్చించు కుంటున్నా సమయంలో రానా తండ్రి సురేష్ బాబు వీరి పెళ్లి ఎప్పుడనే సస్పెన్స్‌ను కూడా తొలగించారు.

రానా తండ్రి సురేష్ బాబు ‘బాంబే టైమ్స్’తో మాట్లాడుతూ రానా, మిహీకాల పెళ్లి డిసెంబర్ లేదా అంతకంటే ముందే జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రానా, మిహీకా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసునని చెప్పిన సురేశ్ బాబు, వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలని అనుకోవడం సంతోషకరమని అన్నారు. అలాగే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: రానా పెళ్లి పై నాని సెటైర్లు 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss