Monday, July 26, 2021

Latest Posts

అలా అయితే నారప్ప చిత్రం ఖచ్చితంగా ఓటీటీ కి ఇచ్చేవాన్ని కాదు

Suresh Babu On Releasing Narappa

అనుకోని పరిస్థితులలో, వెంకటేష్ నటించిన నారప్ప చిత్రాన్ని నిర్మాతలు నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20 న ఈ చిత్రం ప్రసారం కానుంది. తాజాగా ఈ విషయం పై నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. నారప్పను నేను మాత్రమే నిర్మించలేదు. కలైపులి ఎస్ తనుతో కలిసి సినిమాను నిర్మించాను. మహమ్మారి కారణంగా అతను తన చివరి సినిమా కర్ణన్ వల్ల 10-15 కోట్లు వరకు నష్టపోయాడు.

ఇప్పుడు నారప్పకు కూడా ఇదే పరిస్థితులు పునరావృతమవుతాయని అతను భయపడుతున్నాడు. అదే సమయంలో మాకు ఓటిటీ నుంచి ఫాన్సీ ఒప్పందం వచ్చింది దీనితో మేము కాదు అని చెప్పలేకపోయాము. మరోవైపు, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి, ఓటిటీ మార్గాన్ని ఎంచుకున్నాము అని సురేశ్ బాబు తెలిపారు.

సినిమా ఓటిటిలో విడుదల చేయడం పై వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కూడా సంతోషంగా లేరు. అయితే ఈ సినిమాని నేను నిర్మించి ఉంటే ఖచ్చితంగా ఓటిటికి ఇచ్చేవాడిని కాదు. కానీ, నాతో పాటు పార్ట్నర్ ఉంటే దాన్ని నేను ఆపలేను అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss