Sunday, June 20, 2021

Latest Posts

మరో సారి తన మంచితనాన్ని నిరూపించిన తమిళ హీరో

Surya Family Donated 1 Crore

మొత్తం దేశం ప్రస్తుతం కోవిడ్ తో పోరాడుతోంది. సామాన్యుల నుండి రాజకీయ నాయకులు మరియు ప్రముఖుల వరకు అందరూ కరోనా వైరస్ తో యుద్ధం చేయక తప్పట్లేదు. సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి, సినీ ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా తమిళ నటుడు సూర్య కుటుంబం రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోవడంలో తమిళనాడు ప్రభుత్వానికి కోటి రూపాయిలు విరాళంగా ఇచ్చారు.

సూర్య తన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీలతో కలిసి ఈ రోజు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని కోటి రూపాయిల చెక్కును అందజేశారు. ఎంకె స్టాలిన్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు వారు అభినందనలు తెలిపారు.

సూర్య మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు, తాజాగా కోటి రూపాయిలు విరాళం ఇచ్చి మరో సారి తన మంచితనాన్ని నిరూపించుకున్నారు. కోవిడ్ బారీన పడ్డ ప్రముఖుల్లో సూర్య ఒకరు. ఫిబ్రవరిలో, సూర్య కరోనా బారీన పడి విజయవంతంగా కోలుకున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss