Thursday, December 2, 2021

Latest Posts

ప్రముఖ టీవీ ఛానల్ ఆఫీస్ లోకి కత్తులతో ప్రవేశించిన ఆగంతకుడు

Sword-wielding man ransacks Sathiyam TV office

తమిళనాడులోని సత్యం టీవీ కార్యాలయంలోకి ఓ ఆగంతకుడు ఆయుధాలతో కత్తి, డాలు పట్టుకుని బీభత్సం చేసాడు. టీవీ కార్యాలయంలోని అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేసి సిబ్బందిని బూతులు తిడుతూ నానా హంగామా చేశాడు. చెన్నెలోని రోయపురం కామరాజరర్‌ రోడ్డులో ఉన్న సత్యం టీవీ ఛానల్‌ కార్యాలయం లోకి మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ ఆగంతకుడు కత్తి, డాలు తీసుకొని ఆఫీస్ లోనికి   ప్రవేశించాడు. రిసెప్షన్‌లో కనిపించిన ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేసి ఒకటో అంతస్తులోని అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి నానా రభస చేయడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని అతికష్టం మీద సెక్యూరిటీ పట్టుకొని రోయపురం పోలీసులకు సమాచారం అందించగా కార్యాలయానికి చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్‌గా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై సత్యం టీవీ ఎండీ ఇసాక్‌ లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ అతడు ఎవరో, ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదన్నారు. తాము ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదని అన్నారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని ఆ ఛానల్‌ విడుదల చేసింది. ఆగంతకుడు ఎందుకు ఇలా చేసాడో తెలియాల్సి ఉంది. ఈ దాడిని దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss