Monday, January 18, 2021

Latest Posts

10 లక్షలు విరాళంగా‌ ఇచ్చిన‌ సోహెల్‌

Syed Sohel Donated 10 Lakhs

సంపాదించిన దాంట్లో కొంతైనా ఇతరులకు ఇస్తే వచ్చే ఆనందమే వేరు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారు బిగ్‌బాస్‌ ఫేం సయ్యద్ సోహెల్. బిగ్‌బాస్‌ ఇచ్చిన డబ్బులో సయ్యద్‌ సోహెల్‌ ఓ కుటుంబానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. సంపాదనలో కొంత భాగం సేవకు ఖర్చు చేస్తే వచ్చే ఆనందమే వేరని కూడా ఆయన తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి రూ.10 లక్షలు అందించారు.

ఇలా విరాళంగా ఇచ్చిన సోహెల్‌ మాట్లాడుతూ బిగ్‌బాస్‌ ద్వారా తనకు వచ్చిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథాశ్రమాలకు ఖర్చు చేస్తానని ప్రకటించానని చెప్పిన మాట నిలబెట్టుకున్నానని ఇకపై తాను తీసుకొనే ప్రతీ పారితోషికంలో నుంచి 10 నుంచి 15 శాతం సేవకు వినియోగిస్తానని ప్రకటించారు.  10లక్షల రూపాయలను మదర్స్‌ నెస్ట్‌ వృద్ధాశ్రమం(నేరేడ్‌మెట్‌), తబిత స్వచ్ఛంద సంస్థ(రామగుండం), పీపుల్‌ హెల్పింగ్‌ చిల్డ్రన్స్‌ సోషల్‌ ఆర్గనైజేషన్‌(ఆర్టీసీ క్రాస్‌రోడ్‌), జామియా మహదుల్‌ అష్రాఫ్‌(విజయవాడ) సేవాశ్రమాలతో పాటు మహ్మద్‌ మొయినుద్దీన్‌ కుటుంబానికి పంచారు. కాగా, చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రూ.2లక్షల చెక్కు అందించారు. అంతేకాకుండా ఆశ్రమంలో కాసేపు గడిపి, అక్కడి వారికి భోజనం వడ్డించారు సోహెల్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss