Home క్రీడలు 113 పరుగులకే శ్రీలంకను కట్టడి – 114 లక్ష్య ఛేదన లో భారత్ మహిళా క్రికెట్...

113 పరుగులకే శ్రీలంకను కట్టడి – 114 లక్ష్య ఛేదన లో భారత్ మహిళా క్రికెట్ టీం.

T20 Womens World Cup India Need- 114 Runs Win Match Against Srilanka

T20 Womens World Cup India Need- 114 Runs Win Match Against Srilanka

    నేడు శ్రీలంక భారత్​తో జరుగుతున్నమహిళల టీ20 ప్రపంచకప్‌ గ్రూప్​ మ్యాచ్​లో.. నామమాత్రపు స్కోరు చేసింది శ్రీలంక. కెప్టెన్​ చమర్తి ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసింది లంక జట్టు. మ్యాచ్‌లో శ్రీలంక టీమిండియాకు 114 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో లంక 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌వుమెన్లలో చమారి ఆతపత్తు 33 పరుగులు, కవిషా దిల్హరి 25* పరుగులతో రాణించారు.

    మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రాదా యాదవ్‌ 4 వికెట్లతో సత్తా చాటగా, రాజేశ్వరి గైక్వాడ్‌ 2, శిఖా పాండే, పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ తలా ఒక వికెట్‌ తీశారు. ఇన్నింగ్స్‌ ఆసాంతం భారత బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌వుమెన్‌ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కాగా ఇప్పటికే హాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ కు దూసుకెళ్లిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి గ్రూఫ్‌ టాపర్‌గా నిలవనుంది. ప్రసుత్తమున్న టీమిండియా బ్యాటింగ్‌ లైనఫ్‌ చూస్తే 114 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో పెద్దగా కష్టపడనక్కర్లేదనిపిస్తుంది.

Exit mobile version