Saturday, January 16, 2021

Latest Posts

పాజిటివ్ కేసులతో వణికిస్తున్న తాజ్

Taj Mahal Palace Hotel Employees Test Positive for Coronavirus in Mumbai

మహమ్మారి కరోనా దేశంలో కట్టడి చేయడానికి లాక్ డౌన్ అమలు చేస్తున్నా, మరోపక్క పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రం మహారాష్ట్ర గా నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కేసులు రెండు వేలు దాటిపోయాయి. రోజుకొక చోట కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. దీంతో సర్కార్ అప్రమత్తమైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వెయ్యికి పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న వార్త ప్రజలను కలవర పరుస్తోంది. ఒకప్పుడు ఉగ్ర దాడులతో వార్తలకెక్కిన హోటల్ తాజ్ ఇప్పుడు కరోనా కేసులతో దడదడ లాడిస్తోంది.

వీఐపీల తో సందడిగా ఉండే ఫైవ్ స్టార్ హోటల్ లో కరోనా పంజా విసిరింది. వందల సంఖ్యలో ముంబై లబాలోని తాజ్ మహల్ ప్యాలస్ – తాజ్ మహల్ టవర్స్ లో సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని టాక్. సహజంగానే ఈ వార్తతో మహారాష్ట్ర సంచలనం అయింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం షాక్ కు గురిచేసింది. పని చేసే దాదాపు 500 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు తెలుస్తోంది. అసలు కరోనా ఎలా వ్యాపించేదోనని హోటల్ యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం హోటల్ ఖాళీగా ఉంది.అద్దెకు ఎవరికీ ఇవ్వడం లేదు. వేడుకలు రద్దు చేశారు. ఈక్రమంలో కేవలం హౌస్ కీపింగ్ తో పాటు సెక్యూరిటీ – నిర్వహణ సిబ్బంది మాత్రమే ఉన్నారు. కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో ఆ హోటల్ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా కరోనా సోకిన వారిని ఆస్పత్రికి – మరికొందరిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

కాగా చైనా, జపాన్, కొరియా తదితర దేశాల్లో. కొన్నిరోజులపాటు కరోనా కేసులు నమోదుకాలేదు. దీంతో కరోనాను అదుపు చేశామని ఆయా దేశాలు భావించాయి. తాజాగా ఈ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ‘జపాన్, చైనా, కొరియా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడం మనకూ ఆందోళన కలిగించే అంశమే. కాబట్టి మనం సామాజిక దూరం వంటి జాగ్రత్తలు ఎంత కఠినంగా పాటిస్తు న్నామో, భవిష్యత్తులో కూడా ఇదే మాదిరి కొనసాగించాలి’ అని పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss