Thursday, December 2, 2021

Latest Posts

కాందహార్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల

Afghanistan crisis LIVE Updates

అఫ్గానిస్తాన్‌ లో తాలిబన్ల ఆదిత్య పోరు కొనసాగుతుంది. అక్కడి భూభాగాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. ఎప్పుడైతే ఆమెరికా బలగాల అక్కడి నుండి వెళ్లిపోయాయో అప్పటి నుండి వీరి అరాచకాకు అడ్డే లేకుండా పోయింది. కాగా కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడోఅదిపెద్ద నగరమైన గజ్నీ పట్టణాన్ని గురువారం తమవాసం చేసుకున్న తాలిబన్లు తాజాగా కందహార్ పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాట్లు శుక్రవారం ప్రకటించారు.

కాగా వీటితో పాటు గవర్నర్ కార్యాలయం, ఇతర భవనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. కాందహార్‌లోని మార్టిర్ స్క్వేర్ వరకు ముజహిదీన్‌లు చేరుకున్నారని తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్వీట్ చేసారు. విరి రాకతో కాందహార్ నుంచి ఆఫ్ఘానిస్తాన్ భద్రత దళాలు వెనక్కి  వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనుకున్న దాని కంటే తక్కువ సమయంలోనే కాబూల్‌ను కూడా హస్తగతం చేసుకునే అవకాశముందని తాజా పరిస్థితులను చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ ఘటనలతో అఫ్గాన్‌ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ ప్రతిపాదనపై తాలిబన్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. తాలిబన్లు స్పందన కోసం అఫ్గాన్‌ ప్రభుత్వం వేచి చూస్తుంది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss