మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే షూటింగ్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. అయితే దేనికి సంబంధించిన షూటింగ్ అనేది చెప్పలేదు. షూటింగ్ అనంతరం తమన్నా ఇంట్లో రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేశారు. ‘‘షూటింగ్‌ని, సెట్స్‌ని చాలా మిస్ అవుతున్నా. ఓ షూట్ కోసం ముంబైలోని మా ఇల్లే సెట్‌లా మారింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ టీమ్ అంతా పనిచేశాం. కెమెరా ముందుకెళ్లగానే ఎంతో ఉత్సాహం వచ్చింది’’ అని తమన్నా తెలిపారు.
ఇది కూడా చదవండి: