Sunday, May 9, 2021

Latest Posts

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డి‌ఎం‌కే ముందంజ

Tamil Nadu Assembly Election Results 2021

ఇటీవలే దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి. దీనిలో భాగంగా తమిళనాడులో జరిగిన ఎన్నికలలో డి‌ఎం‌కే ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తమిళనాడులో తాము మరోసారి అధికారంలోకి రానున్నామని అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి షాక్ తగిలెట్లుగా కనిపిస్తుంది.

ఇకపోతే ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 234 సీట్లకుగాను డీఎంకే 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే 93 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే పార్టీ అధికారంలోకి రావాలంటే 118 సీట్లు రావాల్సి ఉంది. ఎంకే స్టాలిన్ డీఎంకేకు ఆధిక్యం రావడంతో ఫలితాలు తమకే అనుకూలమని ఆ కూటమి శ్రేణులు మిగతా రౌండ్ల లెక్కింపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 2011 నుంచి అధికారంలో ఉన్న అన్నడి‌ఎం‌కే పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని ఎదురు చూస్తుంది.

మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధిల లేకుండా మొదటి సారి అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారీ మెజార్టీతో విజయం సాధించి తమిళనాడులో అధికారంలోకి రానున్నామని డీఎంకే అధినేత స్టాలిన్ ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమిని విజయం వరించినట్లయితే తమిళనాడుకు నూతన వ్యక్తి ముఖ్యమంత్రి కానున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss