Tamil Nadu Coronavirus Cases
తమిళనాట కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. సోమవారం ఒక్క రోజే అత్యధిక స్థాయిలో 527 కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాట కరోనా వ్యాప్తి దాదాపుగా అదుపులోనే ఉందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన చెన్నైలోని కోయంబేడు హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ఉదంతంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వందల సంఖ్యలో కేసులు బయటపడడంతో కోయంబేడు మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా హాట్‌స్పాట్‌గా మారిన కోయంబేడులో పనిచేసి, స్వగ్రామాలకు వెళ్లిన కార్మికులు 6,984 మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఇక చెన్నైలోనే సోమవారం అత్యధికంగా 266 కేసులు నమోదయ్యాయి. ఇందులో పసికందులు ఎక్కువగా ఉన్నారు. 3 రోజులు, 10 రోజుల శిశువులు కూడా వైరస్ బారిన పడ్డారు. పదేళ్లలోపు చిన్నారులు ఏకంగా 18 మంది కరోనా బారిన పడ్డారు. కోయంబేడు పరిధిలో పనిచేసిన చెన్నై అన్నానగర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఒకరికి కూడా కరోనా సోకింది. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, హోంగార్డుల్లో 34 మంది వైరస్ బారిన పడ్డారు.
కాగా దేశంలో వరుసగా మూడో రోజూ రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యా యి. సోమవారం 2,573 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఒక్క రోజు నమోదైన కేసుల్లో ఇదే అధికం కావడంతో మొత్తం కేసులు 42,836కు పెరిగా యి. మరో 83 మంది కరోనా రోగులు మృతిచెందారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,389కు చేరింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో కొత్తగా 22 మంది కి కరోనా సోకింది. పుణెలో కరోనా సోకిన ఎస్సై (57 ఏళ్లు) మృతిచెందారు. కాగా, హెడ్ కానిస్టేబుల్ ఒకరికి కరోనా వైరస్ సోకడంతో ఢిల్లీలోని 8 అంతస్తులు ఉన్న బీఎ్‌సఎఫ్ కేంద్ర కార్యాలయంలో మొదటి రెండు అంతస్తు లను మూసివేశారు. పశ్చిమ బెంగాల్లో బీఎ్‌సఎఫ్ జవాను ఒకరికి కరోనా సోకగా, కేంద్ర సాయుధ బలగాల్లో ఎస్ఎ్సబీలోనూ 13మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు.