Tuesday, March 2, 2021

Latest Posts

లాక్ డౌన్ను లెక్క చెయ్యని తమిళ తంబీలు

Tamil Nadu people not follow the lockdown rules

ప్రపంచమంత కరోనా తో అల్లాడిపోతుంది దానిని అరికట్టేందుకు కొన్ని దేశాలు లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని నమ్మి వాటిని అమలు కూడా చేస్తున్నారు. మన దేశం లో కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ అమలు చేస్తుంది కానీ కొంతమంది ఆ లాక్ డౌన్ను అంతగా పాటించడం లేదు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని చెప్పిన వినడం లేదు. పోలీసులు ఎంత ప్రయత్నించిన వాళ్ళకు ఇదేమీ పట్టడం లేదు.

లాగే తమిళనాడులో లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో చెబుతున్నా వినకుండా నిన్న జల్లికట్టులో పాల్గొన్న ఓ ఆలయానికి చెందిన ఎద్దు చనిపోవడంతో  అంతిమయాత్రలో వందల మండి తండోపతండాలుగా పాల్గొన్నారు. అలాగే ఇవాళ తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఒకే ఆకులో ఏకంగా వంద మందితో సామూహిక భోజనం చేస్తు ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టారు. ఇక, దీనికి కరోనా ఫుడ్‌ ఫెస్టివల్ అంటూ పేరుపెట్టారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు వెంటనే సామూహిక భోజనం చేస్తున్న వారిలో 21 మందిని అరెస్ట్ చేశారు మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss