Wednesday, April 21, 2021

Latest Posts

యంగ్ డైరక్టర్ మృతి…

తమిళ యంగ్ డైరక్టర్ అరుణ్ ప్రశస్త్ కోయంబత్తూర్ సమీపంలోని మెట్టుపాల్యం దగ్గర బైక్ అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే  మృతిచెందారు.  అరుణ్  దర్శకుడిగా పరిచయం కాకముందు  విక్రమ్ నటించిన  సినిమాకు  శంకర్ దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్  పనిచేసారు. అరుణ్ దర్శకుడిగా జీవీ ప్రకాష్ హీరోగా ‘4జీఅనే సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే ఆయనకు దర్శకుడిగా మొదటి సినిమా. ఆయన మృతితో కోలీవుడ్ మొత్తం షాక్‌కి గురైంది.

అరుణ్ మృతిపట్ల సోషల్ మీడియా ద్వారా శంకర్ తన సంతపాన్ని తెలిపారు.  నా దగ్గర పని చేసిన అసిస్టెంట్ అరుణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గుండెలు పగిలే బాధని కలిగిస్తుంది. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ తన హార్డ్ వర్క్‌తో కెరీర్‌లో ముందుకుసాగాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని శంకర్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: కన్నీళ్లు పెట్టించే వలస కార్మికుల కష్టాలు

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss