Monday, October 25, 2021

Latest Posts

తమిళనాట బారిగా పెరిగిన కరోనా కేసులు

తమిళనాడులో రోజురోజుకూ కరోనా విజృంబిస్తుంది.  గడిచిన 24 గంటలల్లో 789 కొత్త పాజిటివ్ కేసులు రాగా, వీటిలో ఒక్క చెన్నై లోనే 538కేసులు రావడం గమనార్హం. ఈ రోజు కొత్తగా నమోదు ఐన వాటితో కలిపి  తమిళనాడులో మొత్తం పాజిటివ్  కేసుల సంఖ్య 8002 కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ కరోనా మహమ్మారి వల్ల 53 మంది మరణించగా 5,895 మంది వివిధ హాస్పిటల్స్ నందు చికిత్స చేయించు కుంటున్నారు.

కాగా రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధాని మోదీతో జరగిన వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళనాడు సీఎం పళనిస్వామి కీలక సూచన చేశారు.  తమిళనాడు రాష్ట్రానికి మే 31 వరకూ రైళ్ల రాకపోకలకు, విమాన రాకపోకలకు అనుమతి ఇవ్వవద్దని ప్రధాని మోదీని పళనిస్వామి విజ్ఞప్తి చేశారు.  అలాగే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.2వేల కోట్లను కేంద్రం మంజూరు చేయాలని, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో మరిన్ని పీసీఆర్ టెస్టింగ్ కిట్లు అవసరమని తెలిపారు.

ఇది కూడా చదవండి: సిఎం పళనిస్వామికి రజనీకాంత్ వార్నింగ్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss