Wednesday, April 21, 2021

Latest Posts

మీరా చోప్రా పై ఎన్‌టి‌ఆర్ ఫాన్స్ ట్వీటర్ ఎటాక్

తాజాగా మీరా చోప్రా తన అభిమానులతో ఆస్క్ మీరా చోప్రా అనే లైవ్ చాట్ చెయ్యడం తెలిసిందే అయితే ఆ చాట్ లో ఎన్‌టి‌ఆర్ అభిమానులు ఆమెను ఎన్‌టి‌ఆర్ గురించి చెప్పమని అడుగగా ఆమె ఎన్‌టి‌ఆర్ కన్నా నాకు మహేశ్ బాబు అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే ఇదే చాట్ లో పవన్ కల్యాణ్ గురించి అడుగగా పవన్ కల్యాణ్ సూపర్ స్టార్, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పడంతో. తారక్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చి ఆమె పై అసభ్యకర వ్యాఖ్యలు చెయ్యడం స్టార్ట్ చెయ్యడం జరిగింది. ట్విటర్ లో ఈ అసభ్యకర పోస్ట్ లు చూసిన మీరా చోప్రా ఎన్‌టి‌ఆర్ ను తారక్ ఇటువంటి అభిమానులు ఉన్నందుకు నువ్వు సక్సెస్ అయ్యావని అనుకుంటున్నావా  అని ప్రశ్నించింది. అయితే దీనితో మరీ రెచ్చిపోయిన తారక్ అభిమానులు మీరా చోప్రా పై వేశ్య తరహా కామెంట్ లతో పోల్చుతూ తన ఫ్యామిలి ని కూడా దుషించడం జరిగింది. అయితే దీనిపై ఇంకా తారక్ స్పందించలేదు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss