Samantha get a chance with Jr NTR and Trivikram movie:
తారక్ త్రివిక్రమ్ మూవీలో సమంత ఫైనల్?
తెలుగులో సమంత చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి అన్న సస్పెన్స్ దాదాపుగా తీరిపోయినట్టే. ఈ సారి త్రివిక్రమ్ తారక్ కాంబినేషన్ లో కనిపించబోతున్నారట సమంత. ఈ విషయంలో మంచి క్లారిటీతో ఉంది ఫిలింనగర్. యంగ్ టైగర్ తో సామ్ జోడీ కట్టడం ఇది 5 వ సారి. త్రివిక్రమ్ డైరెక్ట్ చెయ్యబోయే #NTR30 మూవీలో ఆ సర్ప్రైజ్ పేరు సమంతేన? బుట్ట బొమ్మనే మళ్ళీ తీసుకుంటారని, గురూజీ ఫోకస్ మొత్తం రష్మిక మీదే ఉంది అని ఇలా రెండు రకాల మాటలు వినిపించాయి.
కాకపోతే ఇప్పుడు స్పెషల్ గా సమంత పేరు ఫైనల్ అయ్యిందట. తారక్ సమంత జోడీ తెలుగు ప్రేక్షకులకి బాగా ఫెమిలియర్ కూడా, ఏకంగా నాలుగు భారీ కమర్షియల్ మూవీస్ లో కలిసి నటించిన క్రేజీ పెయిర్ ఇది, ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర ఉండే స్టోరీ బోర్డులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందట. ఇద్దరిలో ఒకరిగా నటించడానికి సామ్ ఆల్రెడీ ఓకే చెప్పేశారట. తారక్ తో ఎన్ని చేసిన సోలో పెర్ఫార్మన్స్ చేసేయ్ ఛాన్స్ దక్కలేదు సామ్ కి, బృందావనం మూవీలో కాజల్ అగర్వాల్‌తో, రామయ్య వస్తావయ్యాలో శృతి హాసన్‌తో, రభస మూవీలో ప్రణీత సుభాష్‌తో, జనతా గ్యారేజ్ లో నిత్యా మీనన్‌తో ఇలా ఫిమేల్ లీడ్ ని మరొకరితో షేర్ చేసుకున్నారు సమంత.
ఇప్పుడు కూడా సామ్ పక్కన మరొక హీరోయిన్ కి ఛాన్స్ ఉందట. ఆ ప్లేస్ కి రష్మిక ఫైనల్ అయినట్టు టాక్. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ చెయ్యడం రంగస్థలంతోనే ఆపేసారీ రామ లక్ష్మి. తర్వాత ఆమె చేసినవి చేస్తున్నవి కూడా అన్ని పార్ట్ టైం రోల్సే. ఇప్పుడు కమిట్ అయిన విగ్నేష్ శివన్ మూవీలో సమంతకి తోడు నయన్ కూడా నటిస్తుంది. ఇది కాకుండా గేమ్ ఓవర్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్న నెక్స్ట్ మూవీలో డెఫ్ అండ్ డంబ్ క్యారెక్టర్ కి సామ్ నే అప్రోచ్ అయ్యారు. ఏది ఏమైనా మరో సారి ఈ ఆపిల్ బ్యూటీ తారక్ తో స్టెప్పులేస్తే చూడాలన్నది ఫాన్స్ ఆశ.