తరుణ్ భాస్కర్.. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ అలరించిన ఈ దర్శకుడు పెళ్లి చూపులుతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచేయమయ్యి తన సత్తా చూపించాడు. కాగా ఆ సినిమా చేసిన విజయ దేవరకొండ తరువాత పెద్ద హీరో అయిపోగా.. ఈ దర్శకుడు మాత్రం కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. కాగా ఈయన ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఈయనకు బర్త్ డే విషెస్ చెప్పడం జరిగినది. కాగా పెళ్లి చూపులుతో హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమయ్యింది అనే సినిమాతో మళ్ళీ మంచి పేరు సంపాదించుకున్నాడు. కాగా విజయ్ దేవరకొండ నిర్మించిన నీకు మాత్రమే చెబుతా అనే సినిమాలో హీరో గా కూడా చేస్తూ చాలా సినిమాలలో ఆర్టిస్ట్ గా కూడా కనిపిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు.
ఇది కూడా చదవండి: