Monday, May 10, 2021

Latest Posts

బంతిపూల రోజా … అనిత కౌంటర్

TDP EX-MLA Anitha Counter Attacks on Mla Roja

చిత్తూరు జిల్లా పుత్తూరు సుందరయ్యనగర్‌లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లే సమయంలో అక్కడి జనం పూలు నేలపై జల్లుతుంటే ఎమ్మెల్యే రోజా నడుచుకుంటూ వెళ్లడం పై టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. రోజా తీరుపై టీడీపీ నాయకురాలు అనిత మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజా పర్యటనకు సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన అనిత.. ఆ వీడియోలో కొందరు రోజాకు స్వాగతం పలుకుతూ ఆమెపై బంతిపూలు చల్లడాన్ని అనిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రపంచం అంతా సోషల్ డిస్టెన్సింగ్ అని మొత్తుకుంటున్న కీలక సమయంలో తుగ్లక్ సైన్యం మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు.

‘మనం రాజరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం గత పది నెలలుగా నన్ను తొలుస్తుంది. కానీ మనం రాజరికంలో ఉన్నామని ఖచ్చితమైన కన్ఫర్మేషన్‌ను రోజా రెడ్డి ఇచ్చారు’ అని అనిత వ్యాఖ్యానించారు. ‘కరోనా విజృంభిస్తున్న వేళ పక్కపక్కనే నిలబడి బంతిపూలు చల్లటం ఏంటి రోజా రెడ్డి గారూ..? బంతిపూలు చల్లితే కరోనా చచ్చిపోతుందా?’ అని ప్రశ్నించారు. బ్లీచింగ్ ఫౌడర్, పారాసిటమాల్ తర్వాత మీ కౌరవ సైన్యం(వైసీపీ నేతలు) కనిపెట్టిన కొత్త మందు బంతిపూలా? రోజా గారూ అని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాగా నగరి టీడీపీ ఇన్చార్జ్ గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రోజా గత నెల రోజులుగా కరోనా వైరస్‌ను ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఓ ఛానల్ తో అయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేద్దాం, వారి అవసరాలు తీరుద్దామనే ఆలోచన ఆమెకు లేదన్నారు. నగరిలో కరోనా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం రోజానే అని ఆయన ఆరోపించారు. మంది, మార్బలంతో ఒక జోన్ నుంచి మరో జోన్‌కు వెళ్లడం, రెడ్ జోన్ల ప్రాంతాలకు వెళ్లడం.. ఫోటోలుదిగడంలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss