Thursday, December 2, 2021

Latest Posts

టి‌డి‌పి నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన ఏ‌పి‌ పోలీసులు

TDP Leaders Under House Arrest

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌ మైనింగ్ లో వాస్తవాలను తెలుసుకొనేందుకు వెలుతున్న టి‌డి‌పి నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ నిజాలను తెలుసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. ఇందులో వి.అనిత, వర్ల రామయ్య, కె. రవీంద్ర, ఉమామహేశ్వరరావు, ఎన్ రఘురామ్, కె నారాయణ, సౌమ్య, మీరా మరియు రామకృష్ణ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు వారిని వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ కమిటీ శనివారం కొండపల్లి మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించాలని ఇక్కడ అక్రమ మైనింగ్ పై ఆరా తీయాలని ప్రయత్నిస్తుంది. అయితే కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతంలో వారి సందర్శనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు వారిని ఆపివేశారు.

ఇటీవల టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి అటవీ ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన తర్వాత పోలీసులు అతని పై కేసును నమోదు చేశారు. దీని పై ఉమా మాట్లాడుతూ,  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మద్దతుతో వైసిపి నాయకులు అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss