Monday, May 10, 2021

Latest Posts

మండలి రద్దు వార్తలపై టిడిపి షాకింగ్ డెసిషన్

సోమవారం ఎపి మంత్రి మండలి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మండలి రద్దుపై తీర్మానా చేసి,అసెంబ్లీలో పెడతారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో అధికార,విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ఇప్పటికే మండలి దండగ అనే రీతిలో అధికార వైసిపి నేతలు వ్యాఖ్యలు చేయడం,మండలి రద్దు దిశగా పలువు కదుపుతున్నట్లు వార్తలు రావడం నేపథ్యంలో అధికార పక్షం నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురుగా ఎదుర్కోడానికి టిడిపి మరింత అప్రమత్తమైంది. అందుకే సోమవారం శాసనసభకు వెళ్లకూడదని టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. టీడీఎల్పీ సమావేశం ఆదివారం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మండలి రద్దు అంశంపై టీడీఎల్పీలో సుదీర్ఘంగా నేతలు చర్చించారు.

న్యాయనిపుణుల అభిప్రాయాలను, పలు నివేదికల సారాంశాలను నేతలు ప్రస్తావించారు. అంతేకాదు మండలి రద్దుపై టీడీపీ నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మండలి రద్దు సీఎం జగన్ అనుకున్నంత సులభం కాదని నేతలు చెప్పారు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదని ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇప్పటికే మండలి రద్దు, పునరుద్ధరణకు వివిధ రాష్ట్రాల తీర్మానాలు కేంద్రం వద్ద ఉన్నాయని యనమల ప్రస్తావించారు. కేంద్రం అంగీకరించినా కనీసం రెండేళ్లు పడుతుందనే యనమల అభిప్రాయపడ్డారు.

బిల్లుల కోసం కక్షతో మండలిని రద్దు చేయడం,. మరో పిచ్చి నిర్ణయం అవుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ ఆలోచనలు ప్రభుత్వానికే డ్యామేజ్‌ అని మరికొంతమంది నేతలు వ్యాఖ్యానించారు. ఏడాదిలో ప్రభుత్వానికి మండలిలో మెజారిటీ వచ్చే అవకాశం ఉందని, రద్దు జరిగితే వైసీపీకే ఎక్కువ నష్టం అని టీడీఎల్పీలో నేతలు విశ్లేషించారు. మండలి పునరుద్ధరణకు వైఎస్‌ రాజశేఖర్‌కి మూడేళ్లు పట్టిందని కూడా టీడీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఒకవేళ మండలి రద్దు వల్ల టీడీపీ ఎమ్మెల్సీలు నష్టపోతే, అన్ని రకాలుగా ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss