Sunday, February 28, 2021

Latest Posts

మండలిలో పంతం నెగ్గించుకున్న టీడీపీ … మరో సంచలన నిర్ణయం !

వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపుతూ.. శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ తీసుకున్న నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అధికార పక్షం మండిపడుతుంటే,విపక్షం హర్షం వ్యక్తంచేస్తోంది.  మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  ‘‘శాసన చరిత్రలో బుధవారం ఓ బ్లాక్‌ డేగా నిలిచిపోతుంది’’ అని బుగ్గన  ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చొని, వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపేలా నీతిమాలిన పని చేశారని ఆరోపించారు.

‘‘చట్టసభలపై టీడీపీ సభ్యులకు గౌరవం లేదు. చంద్రబాబు చెప్పినట్లు మండలి చైర్మన్‌ పని చేశారు. బిల్లుపై కనీసం డివిజన్‌ కూడా పెట్టకుండా, తన ‘విచక్షణాధికారం’ అంటూ చైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తన ‘బాస్‌’ చెప్పాడని మండలి చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధం. తప్పు అని తెలిసీ తప్పు చేశారు’’ అని ఆరోపించారు. శాసన చరిత్రలో ఇది బ్లాక్‌ డే అని బుగ్గన పేర్కొన్నారు.  బొత్స మాట్లాడుతూ, ‘‘రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే చట్టాలను అడ్డుకుంటే పాలన ఎలా చేస్తాం? బాస్‌ చెప్పారని చైర్మన్‌ ఎలా చేస్తారు? ప్రభుత్వం విచక్షణాధికారం ఉపయోగిస్తే చంద్రబాబు రాజకీయాలు చేయగలరా? చంద్రబాబు రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించి ఏం సాధిస్తారు?’’ అని ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌ విషయమైనా, ఇంకేదైనా బిల్లు రిఫరెన్స్‌ ప్రక్రియ పూర్తి అయ్యాక ఆలోచిస్తామని చెప్పారు.
కాగా శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఓ ఛానల్ కి గురువారం ఇచ్చిన ఇంటర్యూలో   మాట్లాడుతూ   మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులపై సెలక్ట్‌ కమిటి నిర్ణయం ఏళ్లు కూడా పట్టవచ్చని  చెప్పారు.  సెలెక్ట్‌ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలని..అవసరమైతే పొడిగించవచ్చని తెలిపారు. సెలెక్ట్‌ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. బిల్లు సెలెక్ట్‌ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్‌ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. గతంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లను తిరస్కరించారని, సుప్రీం తీర్పు ఇచ్చిందని యనమల గుర్తుచేశారు. మండలిని ప్రోరోగ్‌ చేయకుండా ఆర్డినెన్స్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఆర్డినెన్స్‌ ఇచ్చినా కోర్టులో నిలబడదన్నారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు రూల్‌ 71పై అవగాహన లేదని అన్నారు. రూల్‌ 154 కింద చైర్మన్‌ విచక్షణాధికారాలను కోర్టులు ప్రశ్నించలేవని ఆయన పేర్కొన్నారు. సెలెక్ట్‌ కమిటీ మండలి వరకే పరిమితమని.. అందులోనూ మెజార్టీ తమదే అన్నారు. రెండు బిల్లులపై రెండు కమిటీలు వేయమన్నామని చెప్పారు. శాసనమండలి రద్దు జగన్‌ వల్ల కాదని స్పష్టం చేశారు.

వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది వైసీపీ. అయితే సంఖ్యా బలం ఉండడంతో ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీడీపీ తన పంతం నెగ్గించుకుంది. ఇకపోతే మరోవైపు ఇవాళ టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీతో పాటూ మండలిలో తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై దౌర్జన్యం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యా చరణపై చర్చించనున్నారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేయనున్నారు.

మరోవైపు నిన్న మండలిలో జరిగిన పరిణామాలపై సీఎం జగన్ కూడా సీరియస్గా ఉన్నారు. అసెంబ్లీని  ప్రోరోగ్ చేసి… అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం భావించినట్టుగానే ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎదురయ్యే సమస్యల గురుంచి న్యాయనిపుణులతో పార్టీ కీలక నేతలతో తాడేపల్లిలోని తన ఇంట్లో న్యాయ నిపుణులు ఎంపీ విజయసాయిరెడ్డి తో సీఎం జగన్ చర్చిస్తున్నట్లు సమాచారం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss