Teachers duty at liquor shop:
ఏపి లో నిన్న ఉన్నట్టుండి మద్యం దుకాణాలు తెరవడం ఒక సంచలనం అయ్యింది. నలభై రోజుల పైగా మద్యం దుకాణాలు తెరవకపోవడం వలన మందు బాబాలు పరిస్తితి అగమ్యగోచరంగా మారింది. అందుకే నిన్న మద్యం దుకాణాలు తియ్యడం వల్ల ఒక్కసారిగా భారీగా మద్యం వినియోగదారులు మద్యం షాపుల ముందు బారులు తీరారు. అయితే దీనికి తోడు ఎంకొక సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. మద్యం షాపుల ముందు బారులు తీరిన జనాలను పర్యవేక్షించడానికి పోలీసులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ టీచర్లను కూడా ఈ పనికి వినియోగించడం ఆశ్చర్యం కలిగించింది.
కాగా అక్కడకు వచ్చిన వారెవ్వరూ భౌతిక దూరం పాటించకుండా ఇబ్బడి ముబ్బడిగా క్యూ లైన్ లో బారులు తెరారు. వీరి పర్యవేక్షణకు టీచర్లను డ్యూటి చెయ్యమనడం పై ఉపాధ్యాయులు అంధోలన వ్యక్తం చేశారు. కాగా ఉపాధ్యాయులను ఇలాంటి పనులకు వినియోగించకుండా చూడాలని ఎస్టియూ జిల్లా ప్రధాన కార్యధార్శి పైడి రాజు డిఈఓ లింగేశ్వర రెడ్డికి, ఏపిటిఎఫ్, యూటిఎఫ్, పిఆర్డిఓ ప్రతినిదులు ప్రతినిదులు ఆర్డిఓ లక్ష్మి శివ జ్యోతికి వినతిపత్రాలు అందచేశారు.