Teenage Boy Kills His Father
కన్న తండ్రినే హత్య చేసిన ఘటన నెల్లూరులోని బ్రహ్మదేవి గిరిజనకాలనీలో మంగళవారం రాత్రి కలకలం రేపింది. అయితే పోలీసుల సమాచారం ప్రకారం ఎల్లంపల్లి సుబ్రహ్మణ్యం (35)కు వివాహమైంది. అయితే భార్యాభర్తలు విడిపోయారు. అతను కూలీ పనులకు వెళ్తుంటాడు. కుమారుడు వెంకటేశ్వర్లు స్థానిక హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. సుబ్రహ్మణ్యం మద్యం సేవించినప్పుడల్లా తన తల్లి మొలకమ్మ, కొడుకు, భార్యను దూషించేవాడు.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి సుబ్రహ్మణ్యం మళ్ళీ మద్యం మత్తులో తిట్టడం మొదలుపెట్టడంతో కొడుకు భరించలేకపోయాడు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపం పట్టలేక కొడుకు స్కూల్ బెంచ్ ఇనుప రాడ్తో తండ్రి తల వెనుక భాగంలో కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన బ్రహ్మదేవిలో కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కృష్ణపట్నం సీఐ షేక్ ఖాజావలీ, ఎస్సై అంజిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి: