Monday, October 25, 2021

Latest Posts

ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు కోపంతో కసి తీరా

Teenager Stabbed To Death

ప్రేమ ఎంతటి అనర్ధలకైనా దారి తీస్తుందనడంలో సందేహం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. అయితే ఆమె చుట్టూ తిరగడం ఇంకో అబ్బాయికి నచ్చలేదు. దీనితో వారి ఫ్రెండ్స్ తో కలిసి ఆ 19 సంవత్సరాల యువకుడి పై దాడి చేశాడు. తండ్రి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్‌ చేయాలని కేక్‌ తీసుకొచ్చేందుకు బయటకు వచ్చాడు. అయితే అంతలోని కొందరు దుండగులు అతనిపై దాడి చేసి కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశారు.

దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్‌ నగర్‌లో తన తండ్రి బర్త్‌డే కోసం కేక్‌ కొనేందుకు 19 ఏళ్ల కునాల్‌ అనే యువకుడు రోడ్డు మీదకు వచ్చాడు. ఇంతలోనే ఓ నలుగురు వ్యక్తులు అతనిని చుట్టుముట్టి అతనిని హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అంతలోనే  మరణించినట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసుల నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఓ యువతి ప్రేమ విషయంలో వీరి మద్య తరుచూ గొడవలు జరిగాయని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు గౌరవ్‌, బాధితుడు కునాల్‌ ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్‌ చేస్తున్నారని, దీనితో కునాల్‌పై కోపంతో కసి తీరా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss