telangana adhering to the ICMR guidelines and will follow the coming days
తెలంగాణలో ఎక్కడా ర్యాపిడ్ టెస్టులు చేయలేదని, ఇక మీద తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు చేయబోమని మంత్రి ఈటల రాజేందర్ఈ రోజు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. కరోనా నివారణలో తెలంగాణకు కరీంనగర్ ఆదర్శం. దేశానికి తెలంగాణ ఆదర్శం గా అభివర్ణిచారు. తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు చేయబోమని సీఎం చెప్పారని అలాగే ర్యాపిడ్ టెస్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రజల జేబు గుల్ల అయ్యే ప్రమాదం ఉందని, అందుకే తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్‌లకు టెస్టులు ఇవ్వటంలేదని చెప్పారు.
తెలంగాణలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పటిస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా పాటిస్తామని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణలో ఎక్కడ కూడా కరోనా కేసులను దాచిపెట్టలేదని, తెలంగాణలో కరోనా మరణాలు 2.5 శాతమే నాని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందని, చెప్పారు. తెలంగాణలో కరోనా తో మరణిచిన వారు 25మంది, వారిలో చాలామంది 60 ఏళ్లకు పైబడినవారేనని పేర్కొన్నారు. మరణిచిన వారిలో ఇద్దరు గుల్బర్గా చెందిన వారు కాగా, ఒకరు ఏపీకి చెందినవారుగా తెలిపారు.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు జరుగుతునట్లు అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ మహమ్మారి నుంచి రాష్ట్రం తొందరలో బయటపడాలి . ఇప్పుడున పరిస్థితుల దృష్ట్యా సింటమ్స్ ఉన్నవారందరికీ టెస్టులు నిర్వహిస్తునట్లు, మే 8 వరకు కరోనా ఫ్రీగా తెలంగాణ అవతరిస్తుందని ఆశిస్తునట్లు తెలిపారు. తద్వారా తెలంగాణ జనజీవనం సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వెక్త పరిచారు.