Thursday, February 25, 2021

Latest Posts

తెలంగాణ ఆపిల్ రుచి చూస్తారా..!!

Telangana Apple

ఆపిల్ పండ్లంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కశ్మీర్ ఆపిల్, సిమ్లా ఆపిల్. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆపిల్ పండిస్తుండగా…మరో నెల రోజుల్లో తెలంగాణ ఆపిల్ మార్కెట్లోకి రానుంది. తెలంగాణ కశ్మీర్‌గా పేరొందిన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలో దనోరా గ్రామంలో ఆపిల్ పంట సాగవుతోంది.

ప్రభుత్వ సాయంతో ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ రెండు ఎకరాల విస్తీర్ణంలో 400 ఆపిల్ మొక్కలు నాటగా.. మరో నెలరోజుల్లో పంట చేతికి అందనున్నది. గుంటూరు నుంచి బత్తాయి మొక్కలు తీసుకొచ్చిన నాటిన ఆయన.. రాజమండ్రి నుంచి పది ఆపిల్ మొక్కలు తీసుకొచ్చి నాటగా.. కొన్ని మాత్రమే బతికాయి.

ఇది కూడా చదవండి: చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

సీసీఎంబీ శాస్త్రవేత్తలు 2014లో హరిమన్‌ రకానికి చెందిన 150 మొక్కలను బాలాజీకి ఇచ్చారు. వారి సలహాలను తీసుకుంటూ సాగు చేయగా.. 100 మొక్కలు బతికాయి. 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇచ్చింది.  మూడేళ్లుగా కాయలను కోయకుండా చెట్లకే వదిలేశాడు. ప్రస్తుతం కాయలు 200 గ్రాముల బరువు తూగుతున్నాయి. ఒక్కో చెట్టుకు 20 నుంచి వరకు 40 కాయలున్నాయి. మరో నెల రోజుల్లో కోతకు వచ్చే సమయానికి కాయల బరువు 250 గ్రాముల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆపిల్ సాగు ప్రయోగాత్మకంగా విజయవంతం కావడంతో.. ఆ ఊళ్లోని చాలా మంది రైతులు ఆపిల్ పంట వేసేందుకు మందుకొస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss