Monday, July 26, 2021

Latest Posts

ఆషాడ బోనాలను ఈసారి ఇళ్లల్లోనే

కరోనా వైరస్ వ్యాప్తి తో  మానవ జీవితం అస్తవ్యస్తమైంది. ఎక్కడికీ వెళ్లలేని  ఏ వేడుకా చేసుకోలేని పరిస్థితులు  వచ్చాయి. పుట్టినరోజులు పెళ్లిళ్లతో పాటు ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలు కూడా కళ తప్పుతున్నాయి. ఇప్పటికే ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండగలను ఇళ్లలో ఉండే జరుపుకున్నారు. ఇక తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే ఆషాడ బోనాలను ఈసారి ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. బోనాల వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అందువల్ల  గోల్కొండ బోనాల వేడుకల్లో 10 మంది మాత్రమే పాల్గొంటునట్లు అన్ని దేవాయాల్లోనే ప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తుంది అని ప్రభుత్వం తెలిపింది. ఈసారి పూజారులు మాత్రమే ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు. గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతిలేదని స్పష్టం చేశారు.

ప్రజలంతా తమ మొక్కులను ఇళ్లల్లోనే చెల్లించుకోవాలని, ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారలలో తిలకించాలని అధికారులు తెలుపుతున్నారు.  గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 73శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటంతో బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. బోనాలు, ఘటాల ఊరేగింపు వంటి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనటం జరిగితే కరోనా కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని జంట నగరాల ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

 ఇది కూడా చదవండి :

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss