Friday, March 5, 2021

Latest Posts

బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం  

Telangana BJP President Bandi Sanjay Kumar comments have been sensational

ఓ పక్క కరోనా కల్లోలం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే, మరోపక్క నాయకులు ఎవరి పంధాలో వాళ్ళు మాట్లాడ్డం మానలేదు. అందులో కొన్ని వివాదం రేపుతుంటే, మరికొన్ని కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా అంబేద్కర్ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన తర్వాత  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.  చాలా కాలంగా బీజేపీ ఎజెండాలో గల వివాదాస్పద అంశమైన  ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం.. ఒకే చట్టం ఉండాలన్న కామన్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావించారు. కామన్ సివిల్ కోడ్  అతి త్వరలో దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం సన్నధం అవుతోందని  సంచలన వ్యాఖ్యలు చేసారు.

అంబేద్కర్ ప్రవచించిన పలు అంశాలను బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం నెరవేర్చిందని సంజయ్  చెప్పారు. బీజేపీ నినాదం – విధానం అన్ని కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా ఉంటాయని ఆయన అన్నారు.  అంబేద్కర్ ఆలోచనా విధానాల్లో భాగంగా మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన చెబుతూ, అంబేద్కర్ సూచనల్లో 370 ఆర్టికల్ రద్దు వుందని  స్పష్టంచేశారు.  అందుకే మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని సంజయ్ చెప్పుకొచ్చారు.

రాబోయే రోజుల్లో కామన్ సివిల్ కోడ్ విధానం పట్ల కేంద్రం ఆలోచన చేస్తోందని ఆయన వెల్లడించారు. ఇక  అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానిస్తే బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్ గా  చూస్తుంటే,  బీజేపీ వారి అభ్యున్నతికి పాటు పడుతుందని సంజయ్ తెలిపారు.  అలాగే  రాష్ట్రంలో కరోన కేసులు పెరగడానికి మర్కజ్ ప్రార్ధనలు కారణమయ్యాయని చెప్పుకొచ్చారు.  మే 3వ తేదీ వరకు ప్రధాని మోదీ సూచన మేరకు ప్రజలందరూ లాక్ డౌన్ పాటించాలని, దేశ వ్యాప్తంగా మోదీ ముందు చూపు వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss