Wednesday, December 1, 2021

Latest Posts

ఎక్కడి బత్తాయిలు అక్కడే … కేసీఆర్ కీలక నిర్ణయం 

Telangana CM KCR strong comments on corona:

మహమ్మారి  కరోనా వైరస్ ని  నియంత్రించేందుకు ప్రంపంచమంతా చర్యలు చేపడుతున్నారు. ఇక మన దేశంలో ఖచ్చితంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రాల్లో కూడా అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. ఇక  తెలంగాణ ప్రభుత్వం అయితే అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రాలకు బత్తాయి ఎగుమతులను నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

బత్తాయిలో రోగనిరోధక శక్తి పెంచే విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ తాజా నిర్ణయం తీసుకున్నారు. రైతులను ఒప్పించి వాటిని హైదరాబాద్‌లో విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.  అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వమే బత్తాయిలను కొని సరఫరా చేసే పరిస్థితి కూడా లేదు.

తెలంగాణలో నల్గొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉన్నాయి. రెగ్యులర్‌ సీజన్‌లో(అక్టోబర్‌, నవంబర్‌ నెలలు) 5 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీ సీజన్‌లో (మార్చి, ఏప్రిల్‌) 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల బత్తాయి ఉత్పత్తి అవుతుంది. అయితే తెలంగాణలో ఉత్పత్తయ్యే బత్తాయిలో 98% ఉత్తరాది రాష్ట్రాలకే ఎగుమతవుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో  రైతులను ఒప్పించాలని నిర్ణయించారు. బత్తాయిలను హైదరాబాద్‌కు తరలించేందుకు అధికారులు వాహనాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss