తెలంగాణలో గడచిన 24 గంటల్లో 42 పాసిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది. కాగా మొత్తం తెలంగాణలో కేసులు 1634 కాగా, నయం అయిన వాళ్ళ సంఖ్య 1011, వలస వెళ్ళిపోయిన వారి సంఖ్య 77 గా నమోదయ్యాయి. ఇప్పటివరకు 9 మంది డిశ్చార్జ్ కాగా, 38 మంది మరణించడం జరిగింది. ఇప్పటివరకు యాక్టివ్ గా నమోదయిన కేసుల వివరాలు 585గా ఉన్నాయి.
గడచిన 24 గంటల్లో జిహెచ్ఎంసి (హైదరబాద్) -34, వలస వచ్చినవారు -8 మంది మొత్తం 42 మంది పాసిటివ్ రావడం జరిగింది. కాగా వరంగల్ రూరల్, యాదగిరి, వనపర్తి మూడు జిల్లాలలో ఒక్క కేసు నమోదు కాకుండా ఉంది. ఈ మూడు జిల్లాలు మరియు జిహెచ్ఎంసి తప్ప మిగిలిన 25 తెలంగాణ జిల్లాలలో ఒక్క కేసు కూడా గడచిన 14 రోజుల నుంచి నమోదు కాకపోవడం కొంచెం ఊరట కలిగించే అంశం.
ఇది కూడా చదవండి: