Sunday, May 9, 2021

Latest Posts

లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Announces Lockdown

కోవిడ్ -19 కేసులు మొత్తం భారతదేశంలో 1.50 కోట్లకు చేరాయి. కేవలం 15 రోజుల్లో 25 లక్షల కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన 19 లక్షల యాక్టివ్ కేసులు కూడా దాటి 25 లక్షల వరకు చేరాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు 1,50,61,919 కు పెరిగాయి, ఒకే రోజు 2,73,810 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న మరణించిన వారి సంఖ్య 1,619 తో వాటి సంఖ్య 1,78,769 కు చేరింది.

దీనితో తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. ఇది ఈ రోజు నుంచి మే 1వ తేదీ వరకు ఉండనున్నట్లు తెలిపింది. తర్వాత ఏమి చేయాలో మరోసారి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకొనున్నట్లు తెలిపింది. ఈ లాక్ డౌన్ సమయం లో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో దాన్ని నియంత్రించడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. దీనితో తెలంగాణా ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss