Monday, July 26, 2021

Latest Posts

పార్కింగ్ ఫీజు వసూలుకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Telangana government gives permission for parking fees

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో నిలుపుదలను తెచ్చింది. ఈ నేపధ్యంలోనే వినోద పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది ఈ మహమ్మారి. వైరల్ స్ప్రెడ్ భయం మరియు లాక్డౌన్ల కారణంగా, చాలా రోజులు థియేటర్లు మూసివేయవలసి వచ్చింది. అయితే చాలా కాలం తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొన్న థియేటర్ యజమాన్యానికి విశ్రాంతినిస్తూ, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ థియేటర్లకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

దీనికి సంబంధించి ప్రభుత్వం జి.ఓ. జారీ చేసింది. కోవిడ్ -19 కారణంగా నష్టాలను చవిచూసిన సినిమా థియేటర్లకు ఇప్పుడు కాస్త ఊరట లభించింది. రాష్ట్రంలో థియేటర్లు ప్రారంభమయ్యే రోజు జూలై 23 నుండి అభిమానుల వద్ద పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss