తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్‌తో నిన్న విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయవలసిందిగా సూచించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్నవారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒక్కొ ఏ.ఎన్.ఎంకు వంద ఇళ్లు కేటాయించి మూడు, నాలుగు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: అస్వస్థతకు గురైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి