తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. లాక్డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూన్ 2వ తేదీన ఘనంగా వేడుకల నిర్వహణ సాధ్యం కాదని, అందుకే సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో పబ్లిక్ గార్డెన్స్, జిల్లా కేంద్రాలు, అన్ని గవర్నమెంటు ఆఫీసుల్లో ఘనంగా వేడుకలు నిర్వహించేవారు. అయితే, వేడుకల్లో పాల్గొనే ఏ ఒక్కరికి కరోనా సోకినా.. వాళ్ల నుంచి అందరికీ సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నమెంటు ఆఫీసుల్లో జాతీయ జెండాలు మాత్రమే ఎగురవేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:తిరుపతి లో భారీ ట్రాఫిక్ జామ్