Telangana govt releases Rs 1500 for white ration card holders
లాక్డౌన్ కారణంగా పేదలకు ఉపాధి లేకపోవడంతో, రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొకరికి 12కేజి ల బియ్యం, కుటుంబానికి కేజి కందిపప్పు మరియు ప్రతి కుటుంబానికి రూ.1500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేయతిఒన్ షాప్ల ద్వారా బియ్యం, కందిపప్పు అందజేశారు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 అందించనున్నారు. మంగళవారం ఈ డబ్బు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి తమ అకౌంట్లలో జమకానున్నాయి అని స్వయంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లే తెలంగాణవ్యాప్తంగా 74లక్షలకుపైగా అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని, మొత్తం రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసినట్లు తెలిపారు.
అయితే ప్రభుత్వం బ్యాంక్ లకు రూ.1,112 కోట్లను మొత్తం బదిలీ చేసెసింది. కానీ మంగళవారం అంబేద్కర్ జయంతి కావడంతో బ్యాంకులకు సెలవు అందువల్ల బ్యాంక్ లు బుధవారం చెల్లింపులు చేయ్చు అని తెలుస్తుంది. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్లకు ఏటీఎం కార్డులు ఉన్నవారు మాత్రం మెసేజ్ వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవచ్చు అని అదికారులు అంటున్నారు.