Home రాజకీయం రండి…. త్వరగా రండి….

రండి…. త్వరగా రండి….

లాక్ డౌన్  నేపద్యంలో వలస కూలీలు వారివారి రాష్ట్రాలకి వెళ్లిపోవడంతో తెలంగాణలో కూలీల కొరత తీవ్రం గా ఏర్పడి. దీంతో వెళ్లిన వారిని రప్పించేందుకు నానా పాట్లు పడాల్సి వస్తుంది. రైస్ మిల్లర్లకు రైతులకు సంబంధించిన ధాన్యం బస్తాలకేత్తే వారు మరియు ఇతర పనులకు ఏకంగా తెలంగాణ మొత్తంలో 20 మంది కూలీలు హమాలీలు కావాల్సి ఉంది. ధాన్యం లోడింగ్ అన్-లోడింగ్ చేయడంలో బీహారీలు స్పెషలిస్ట్ గా ఉన్నారు. ఇప్పటికీ సీఎం కేసీఆర్ హమాలీలను పంపించడానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒక ప్రత్యేక రైళ్లు కూడా వేశారు. అలా ఆ ప్రత్యేక రైలు వేయగా ఇప్పటివరకు లోడింగ్ అన్ లోడింగ్ కోసం 500 మంది హమాలీలు మాత్రమే రాష్ట్రానికి వచ్చారు.

దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని బీహార్ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి రైస్ మిల్లర్లకు టచ్ లో ఉన్న వేలాది మంది హమాలీలకు ఈ విషయాన్ని తెలియజేశారు. దాంతో వారు తెలంగాణకు రావడానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మేము వస్తామని అని చెబుతున్నారు. దాంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హమాలీలు బిహార్ లోని ఏ ఏ జిల్లాలో ఇక్కడ నుండి వెళ్ళి ఉన్న వారిని తిరిగి తెలంగాణకు రావడానికి ఆసక్తిగా ఉన్నారో వారి జాబితాను బీహార్ ప్రభుత్వనికి పంపి, అత్యవసరం కావడంతో ప్రభుత్వం నుండి ఇబ్బందులు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహించి ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో హమాలీలను, కార్మికులను  పంపాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణాలో మొదలుకానున్న RTC సర్వీసులు

Exit mobile version