కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో రాష్ట్రంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమయ్యింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్ 3న ఇంటర్ రెండో సంవత్సరం జాగ్రఫీ, మోడరన్ లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు.
పాత హాల్‌టికెట్ల నంబర్లతో గతంలో కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వాస్తవంగా మార్చి 23న జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఇది కూడా చదవండి: దేశీయ సంస్థలకే ప్రాధాన్యత