Sunday, June 20, 2021

Latest Posts

జూలైలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్న తెలంగాణ

telangana inter exams 2021

ఇంటర్ మీడియట్ పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తుందట ఇంటర్ బోర్డు. అంతేకాకుండా విద్యార్ధుల పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రశ్నాపత్రాల్లో మార్పులు, పరీక్షా సమయాన్ని సైతం కుదించినట్లు సమాచారం.

ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రితో జరిపిన చర్చలలో జూన్ నెలాఖరున ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే జూన్ నెల చివరి వారానికి కరోనా అదుపులోకి వస్తుందో.? లేదో.? అనే సందేహం అధికారులలో నెలకొంది. దీనితో పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట.

అటు సీబీఎస్ఈ బోర్డు కూడా జూలైలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుండటంతో.. రాష్ట్రంలోనూ జూలై రెండో వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss