Telangana IT Minister KTR wrote to letter various companies
ప్రపంచ దేశాలు కరోనా ప్రభావంతో వాణికిపోతున్నాయి ప్రస్తుత పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా చాలా కంపెనీలు ఆర్ధిక మాంద్యాన్ని ఎదురుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో దాన్ని అధిగమించేందుకు కొంతమంది ఉద్యోగులను తొలగించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి ఆయా కొంపనీలు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలకు లేఖ రాశారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలి అని ప్రతి ఉద్యోగి పట్ల తమ వంతు అండగా చేయూత ఇవ్వాలని కోరారు.
అంధుచేత ఒక్క ఉద్యోగిని కూడా ఉద్యోగం నుంచి తొలగించకుండా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని ఆయా కంపెనీలను విజ్ఞప్తి చేశారు.లాక్ డౌన్ అనంతరం ఐటీ పరిశ్రమ పుంజుకుంటుందని అప్పుడు ఆర్దికంగా బలపడవచ్చు అని మన తెలంగాణ ప్రభుత్వం అన్ని విదాలుగా కంపెనీలకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాగా, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 43 కరోనా కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 809కి చేరింది. దీనిలో గ్రేటర్ హైదరాబాద్ నుంచే 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.